పోలాల అమావాస్య హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. పూర్వీకులను గౌరవించిన పండుగ ఇది. భక్తులు తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ రోజున పూజను నిర్వహిస్తారు. సోమావతి అమావాస్యను తెలుగు వారు పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. పోలాల అమావాస్య చేసిన పూజలు ఇంట్లోని పిల్లలకు యోగ క్షేమాలు అందిస్తాయని నమ్మకం. ఎవరికైతే సంతానం లేదో వారు ఈ పండుగను చేయడం వల్ల వారికి పిల్లలు కలిగే అవకాశం ఉందని చెప్పుకుంటారు. మన తెలుగు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 2 తేదీన శ్రావణమాసంలో చివరిరోజైన అమావాస్య వచ్చింది. అదే రోజు కొందరు సోమావతి అమావాస్యను లేదా పోలాల అమావాస్యను నిర్వహించుకుంటారు.