ఇన్ స్టాలో వివరణ
ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను 13,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్ల స్పదన మిశ్రమంగా ఉంది. ఆమె బోల్డ్ ప్రాంక్ ను కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తూ పోస్ట్ లు పెడ్తున్నారు. అయితే, ఈ వీడియో 2019 నాటి ఒక షో కు సంబంధించిన ఒక టాస్క్ లో భాగమని తనుమితా ఘోష్ వివరించారు. “గయ్స్, ఈ వీడియో 2019 లో చిత్రీకరించిన షోలో భాగం. ఒక టాస్క్ లో భాగం. సోనాక్షి సిన్హా, షలీనా నథానీ, మనీష్ మల్హోత్రా, డినో మోరియా తదితరులు ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇది ఒక ఎపిసోడ్ లో టాస్క్ కాబట్టి దయచేసి అంత సీరియస్ గా తీసుకోకండి! థ్యాంక్యూ’ అని తనుమితా ఘోష్ రాసుకొచ్చారు.