కాంగ్రెస్ ఆమోదం అవసరం
అమెరికా ట్యాక్స్ కోడ్ లో మార్పులకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పై పట్టు కోసం డెమోక్రాట్లు, రిపబ్లికన్లు గట్టిపోటీ ఇస్తున్నారు. మరోవైపు, ఏడాదికి 4,00,000 డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదించే వారిపై పన్నులు పెంచబోమని అధ్యక్షుడు జో బైడెన్ (biden)న్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. గత వారం ఇచ్చిన ఆర్థిక విధాన ప్రసంగంలో కమలా హారిస్ పలు విధాన హామీలు ఇచ్చారు. మెజారిటీ అమెరికన్లపై పన్ను భారం తగ్గించడం, వ్యాపారుల “ధరల దోపిడీని” అడ్డుకోవడం వంటి హామీలు అందులో ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను అనుసరించాలనుకుంటున్న “ఆపర్చునిటీ ఎకానమీ” లో భాగంగా మరింత సరసమైన ధరలకు గృహాలను నిర్మించే ప్రతిపాదనలను వివరించారు.