వాణిజ్య పన్నుల శాఖ నివేదిక ఆధారంగా ఏసీ కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల నుంచి వివరణ కోరారు. సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే మార్పులు చేయాలని ఐటీ సంస్థకు తాము సూచించినట్లు వారు వివరణ ఇచ్చారు. మరోవైపు వాణిజ్యపన్నుల శాఖకు సంబంధించి తాము ఎలాంటి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయలేదని ప్రియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది. గతజనవరిలో ఈ వ్యవహారంపై ఆడిట్ జరిపించారు. కమర్ఫషియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ డేటాను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు,దానిలో మార్పుు చేసే అవకాశం ఉందని గుర్తించారు. ఈ క్రమంలో అధికారుల మధ్య నడిచిన వాట్సప్ చాట్ హిస్టరీలను కూడా సేకరించారు. సోమేశ్ కుమార్, కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ల మధ్య నడిచిన వాట్సప్ సందేశాలను సేకరించారు. ఈ వ్యవహారంలో అక్రమాలను నిర్దారించే ఆధారాలు సేకరించిన తర్వాత కేసులు నమోదు చేశారు.