టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
టీజీ పీఈసెట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పీఈసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 7 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆగస్టు 13, 14వ తేదీల్లో స్పోర్ట్, ఎన్‌సీసీ, సీఏపీ, పీహెచ్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 14న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 18న వెబ్ ఆప్షన్స్ ఎడిట్ కు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 20న పీఈసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.