సింగరేణి ఉద్యోగాలు
సింగరేణి యాజమాన్యం మార్చి నెలలో విడుదల చేసిన ఎక్స్‌టర్నల్ సెకండ్ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు విభాగాల్లో 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఉద్యోగ రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 6, 7 తేదీల్లో జరుగుతాయని పేర్కొంది. 7 రకాల కేటగిరీ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ల డౌన్లోడ్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చని వివరించింది. షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ –సీ, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్ కేటగిరీ –1 పరీక్షలను నిర్వహించనున్నరు. ఇక రెండో రోజు అంటే ఆగస్టు 7వ తేదీన మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఈఅండ్‌ఎం) ఈ –2 గ్రేడ్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సిస్టమ్) ఈ–2 గ్రేడ్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రెయినీ (మెకానికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ – సీ పరీక్షలు జరగనున్నాయి.