తాడేపల్లిగూడెం మండలంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభ వించడంతో గాయాలపాలైన కుటుంబం తాడేపల్లిగూడెం ఏరియా ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్య, భర్తలు గురువారం మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలోని టిడ్‌కో ఇళ్ల వద్ద మంగళవారం ఉదయం గ్యాస్ బండ పేలిన ఘటనలో భార్య భర్తలు బోడపాడు మురళి (37), బోడపాడు కుమారి (34), కుమార్తె నీలిమలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మురళి, కుమారిలు గురువారం మృతి చెందారు. నీలిమకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్ వివరించారు.
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో భార్య భర్తలు మృతి : తాడేపల్లిగూడెం
RELATED ARTICLES