Friday, September 20, 2024
Homeకోస్తా ఆంధ్రాఏలూరుజిల్లాగంజాయికి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి - ముదినేపల్లిలో ర్యాలీ

గంజాయికి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి – ముదినేపల్లిలో ర్యాలీ

గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి

ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల. వైష్ణవి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని డాక్టర్లు, మందుల దుకాణాల యజమానులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అంబుల వైష్ణవి, డా. మనోజ్ ల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అంబుల వైష్ణవి, మనోజ్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గంజాయికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు వంటి వాటిని దగ్గరకు రానీయకూడదన్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినవారు ఉంటే మానుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments