ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామస్థాయిలో క్యాన్సర్ నిర్ధారణకు ఆగస్టు 15 నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఏటా 50 వేల నుంచి 70 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 1.47 లక్షల మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. క్యాన్సర్ వైద్యసేవలకు ప్రభుత్వం ఏటా రూ.680 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
Hi