ఆగస్ట్ 5 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమనం చెందుతాడు. అందువల్ల సింహ రాశి అనేక రాజయోగాలకు, గ్రహాల కలయికకు వేదిక కాబోతుంది. దీనితో పాటు రాహువు మీనం, కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. గ్రహాల గమనం వల్ల బుధాదిత్య రాజయోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, శశ రాజయోగం, సంసప్తక యోగం, త్రిగ్రాహి యోగం, గజకేసరి రాజయోగం వంటి ఎన్నో శుభ యోగాలు ఏర్పడబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో గ్రహాల సంచారం కారణంగా ఆగస్ట్ నెల 3 రాశుల వారికి వరం కంటే తక్కువ కాదు. ఐదు గ్రహాల సంచార ఫలితంగా ఏర్పడబోయే ఆరు రాజయోగాల వల్ల ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయో చూద్దాం.