షర్మిలకు వైసీపీ కౌంటర్
షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారికోసం పనిచేసేవారికీ మధ్య తేడా ఉంటుందని వైసీపీ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది. షర్మిల మాటలు చూస్తే జగన్ మీద ద్వేషమే కనిపిస్తోంది తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండి, మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే… మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలకడం, జగన్ తిట్టడం అని స్పష్టమవుతుందంది. వైయస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే.. ఎప్పుడైనా నోరు విప్పారా?