కర్కాటక రాశి వార ఫలాలు 4-10 ఆగష్టు 2024: కర్కాటక రాశి వారి జీవితంలో ఈ వారం అనేక ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సర్వత్రా అనుకూలమే. సమస్యలు సద్దుమణుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రతి రంగంలో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రిలేషన్ షిప్, కెరీర్, ఫైనాన్స్, హెల్త్ పరంగా కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మారండి. దీంతో సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలుగుతారు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ విషయాలను వారితో పంచుకోవద్దు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.