అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన స్నేహితురాలు, మరో యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై సింహాచలం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు అనకాపల్లి మండలం శంకరం వద్ద వీరిని కొత్తూరుకు చెందిన యువకుడు తేజ సాయి కుమార్ అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. అప్పుడు తేజసాయి కుమార్‌తో ఆయన మిత్రులు బి.శంకర్, ఎం.హరీష్, అభిలాష్, ఎన్.పవరన్, వి.రామ్ శాంతారాం ఉన్నారు. అయితే వాగ్వాదం జరుగుతున్న సమయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన ఆ యువతి మనస్తాపానికి గురై పక్కనే ఉన్న ఏలేరు కాలువలో దూకింది. అయితే తేజసాయి కుమార్ కాలువలో దూకిన యువతను కాపాడాడు. అనంతరం ఉడ్‌పేటలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. జులై 25 రాత్రి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి తీవ్ర భయాందోళనకు లోనైంది. దీంతో యువతి భయపడి కూండ్రంలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.